Andamga Lenaa Lyrics- Sunitha

Andamga Lenaa Lyrics - Sunitha


Andamga Lenaa Lyrics
Singer Sunitha
Composer K.M. Radha Krishnan
Music K.M. Radha Krishnan
Song WriterVeturi

Lyrics


అందంగా లేనా అసలేం బాలేనా
అంత లెవలేంటోయ్ నీకు

అందంగా లేనా… అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా, ఓ ఓఓ ఓ
మ్మ్, అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా, ఓ ఓఓ ఓ
మ్మ్, అలుసై పోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా, ఆ ఆ
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

కనులు కలపవాయే… మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకీ
కలికి చిలకనాయే… కలత నిదురలాయే
మరవలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వొచ్చి అడగాలి..!
అన్నట్లు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

నీకు మనసు ఇచ్చా… ఇచ్చినపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా… తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచు… తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు… నటనలే అదీ
ఎన్నెల్లో గోదారి… తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే… ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా

అందంగా లేనా… అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా, ఓ ఓఓ ఓ
మ్మ్, అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా, ఓ ఓఓ ఓ
మ్మ్, అలుసై పోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా, ఆ ఆ
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

 



Andamga Lenaa Lyrics Watch Video

No comments:

Post a Comment

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S ...