Godari Gattu Meeda Lyrics Lyrics - Ramana Gogula, Madhupriya

Singer | Ramana Gogula, Madhupriya |
Composer | Bheems Ceciroleo |
Music | |
Song Writer | Bhaskara Bhatla Ravi Kumar |
Lyrics
హే..గోదారి గట్టు మీద
రామ..సిలకవే
గోరింటాకెట్టుకున్న
సంద..మామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే
నీతోటీ కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద
రామ..సిలకనే
గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే
హే .. విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్
ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడిక్కించావే
ఇరుగు పొరుగూ ముందు
సరసాలొద్దండోయ్
గురకెట్టి పడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళూ
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు
పెళ్ళైయి సేన్నాల్లే
అయినా కానీ మాస్టారూ
తగ్గేదే లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు
గోదారి గట్టు మీద
రామ..సిలకవే
గోరింటాకెట్టుకున్న
సంద..మామవే
కొత్త కోకేమో
కన్నే కొట్టిందీ
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందీ
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టేయినా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టేయ్ నా
ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానేయ్ మంటుందే
అబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్ నా
ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
ఓసోసి ఇల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపేద్దాం
నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద
రామ సిలక..నే
నీ జంట కట్టుకున్న
సంద..మామనే
No comments:
Post a Comment